JAISW News Telugu

Raghava Lawrence : లారెన్స్ పెంచిన వాడే సాయం అందించే స్థాయికి.. ఉప్పొంగిన లారెన్స్ సంతోషం

Raghava Lawrence

Raghava Lawrence

Raghava Lawrence : డ్యాన్సర్, నటుడు, డైరెక్టర్, నిర్మాత, కొరియోగ్రాఫర్ ఇలా ఒక్కటేమిటి వివిధ రంగాల్లో ప్రతిభావంతుడు లారెన్స్. ఇంతకుమించి పది మందికి సేవా చేయాలనే గుణం కలిగి ఉన్న గొప్ప వ్యక్తుల్లో లారెన్స్ ఒకరు. లారెన్స్ అత్యంత ప్రతిభావంతమైన నటుడు, డ్యాన్సరే కాకుండా ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అక్కడ వాలిపోయి సాయం చేసే పెద్ద మనుసు ఉన్న గొప్ప ఉదారవాది. 

లారెన్స్ గతంలో సాయం చేసిన శ్యామ్ అనే కుర్రాడు ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దీంతో పాటు అతడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. శ్యామ్ తనకు వచ్చిన డబ్బును హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం విరాళంగా ఇచ్చాడు. అయితే శ్యామ్ ను చిన్నప్పటి నుంచి చూసుకుంది.. చదివించింది లారెన్సె. దీంతో లారెన్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

చాలాా సంతోషంగా ఉంది. శ్యామ్ అనే కుర్రాడు హెప్సిబా అనే చిన్నారి చదువు కోసం ఏడాది ఫీజును చెల్లించాడని ఎక్స్ (ట్విటర్ ) లో వీడియో పోస్టు చేశాడు. నేను నాటిన విత్తనం ఉదారమైన స్వభావం గల వ్యక్తి తయారై సేవా చేసే గుణాన్ని పెంపొందించుకున్నాడు. నలుగురికి సాయపడే క్యారెక్టర్ రావడం ఆనందం. చదువుకుంటూనే హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం పార్ట్ టైం జాబ్ చేసి సంవత్సరం ఫీజు కట్టడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని లారెన్స్ అన్నాడు. 

ఈ సంతోషకరమైన క్షణాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను అని లారెన్స్ అన్నారు. మీ అందరి ఆశీర్వాదం శ్యామ్ కు కావాలని కోరాడు. శ్యామ్ మరింత ఎదిగి పది మందికి సాయం చేసే వ్యక్తిగా మార్గదర్శకుడిగా కావాలని కోరుతున్నానన్నాడు. లారెన్స్ గతంలో అనేక మంది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది పిల్ల ప్రాణాలు కాపాడారు. లారెన్స్ ను తమిళనాడులో చాలా మంది దేవుడిగా కొలుస్తారు.

Exit mobile version