Prabhas marriage : పాన్ ఇండియా హిరో ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభాస్ తన పెళ్లి గురించి గతంలోనే హింట్ ఇచ్చారు. అయినా కూడా మా కలల రాకుమారుడి పెళ్లి ఎప్పుడు అంటూ తెగ బాధపడిపోతున్నారు. ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మ శ్యామల దేవి కూడా చాలా సార్లు త్వరలోనే అని చెప్పినా అవేవీ నిజం కాలేవు.
ప్రభాస్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నాడని ఆమెనే పెళ్లి చేసుకుంటాడని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అది కూడా జరగలేదు. ఆదిపురుష్ సమయంలో కృతి సనన్ తో ప్రేమాయాణం సాగిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అది కూడా కేవలం వార్తగానే మిగిలిపోయింది.
ఈ అక్టోబర్ 23తో ప్రభాస్ తన 45వ పుట్టినరోజు వేడుక కూడా జరుపుకున్నాడు. ప్రభాస్ పెళ్లిపై గతంలోనే హింట్ ఇచ్చాడు. గతంలో కొంతమంది అమ్మాయిలతో చాట్ చాట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒక అమ్మాయి మీరు అమ్మాయిల హార్ట్ ను ఎప్పుడు బ్రేక్ చేస్తారని అడగ్గా.. అమ్మాయిలంటే తనకు ఎంతో గౌరవం, ఇష్టం. అలాంటి అమ్మాయిల హార్ట్ ను ఎప్పటికీ బ్రేక్ చేయనని అన్నాడు.
బాలకృష్ణతో అన్ స్టాపబుల్ లో కూడా పెళ్లి గురించి అడగ్గా సల్మాన్ ఖాన్ చేసుకున్నాడా ? ఇప్పుడు పెళ్లి గురించి అవసరమా అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే తాను చేసుకుంటానని చెప్పాడు. దీంతో ప్రభాస్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రభాస్ కు పెళ్లి ఇష్టం లేదని తనకు ఒంటరి లైఫ్ అంటేనే ఇష్టమని చెప్పకనే చెప్పాడు. తనకు సెట్ అయ్యే అమ్మాయి ఇంకా దొరకడం లేదని కూడా అన్నాడు. ఇలా ప్రభాస్ లాంటి వ్యక్తికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిస్తే అమ్మాయిల గుండెలు నిజంగా నే బ్లాస్ట్ అయిపోతాయేమో అని అన్నాడు.