Latest Survey in AP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కార్ ను కూల్చేందుకు జనాలు రెడీ అయ్యారా? టీడీపీ- జనసేన కూటమికి అధికారం అప్పగించేందుకు డిసైడ్ అయ్యారా? సుదీర్ఘ అనుభవశాలి చంద్రబాబుకు పాలనపగ్గాలు అప్పజెప్పేందుకు సమయం అసన్నమైందా? అంటే అవుననే చెప్తోంది తాజాగా ఓ సర్వే. టీడీపీ జనసేన కూటమి ప్రళయంలో ఫ్యాన్ రెక్కలు ఊడి మైనింగ్ కాలిపోయి, బేరింగులు పోయి కుప్పకూలిపోవడం ఖాయమనే ప్రజల అభిప్రాయాన్ని ఈ సర్వే సంస్థ ప్రకటించింది. ఏపీ రాజకీయాల్లో సంచలన విషయాలను ఈ సర్వే ఈనెల 5వ తేదీన వెల్లడించింది. సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఎవరెన్ని కూటములు కట్టినా తనదే విజయమని సీఎం జగన్ మొండిగా వెళ్తున్న విషయం తెలిసిందే. తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో అపజయం వైపు వెళ్తున్నారని ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అంతా భావిస్తున్నప్పటికీ ఈ సర్వే మాత్రం అంతసీన్ లేదని అంటోంది. కూటమి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ రాబట్టబోతోందని బల్లగుద్ది మరి చెబుతోంది. ఈ ఫలితాల ప్రకారం వైసీపీ దారుణ ఓటమిని ఎదుర్కొనబోతున్నది అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో దాదాపు మరో నెలన్నరలో జరుగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంచలన విజయం నమోదు చేయబోతోంది. దానికి నిదర్శనంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. మొత్తం ఓట్లలో వైసీపీకి 39.60 శాతం ఓట్లు పోల్ కానున్నాయి. టీడీపీ, జనసేనకు ఎవరికీ అందనంతగా 53.10శాతం ఓట్లు పోల్ కానున్నాయని సర్వే అంచనా వేస్తోంది. ఇతరులకు 3.80శాతం ఓట్లు, సైలంట్ ఓట్ ఫ్యాక్టర్ వోట్లు 3.50శాతం ఎటైనా పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక సీట్ల పరంగా చూస్తే..
టీడీపీ, జనసేన : 153
వైసీపీ : 22
ఇతరులు : 0
సీట్లను సంఖ్య చూస్తే 2019 ఎన్నికలు రివర్స్ కొట్టాయా అనిపిస్తుంది కదా. కూటమికి ఎవరూ ఊహించని విధంగా 153 సీట్లు వస్తే వైసీపీ 22 సీట్లకే పరిమితం కాబోతోందని సదరు సర్వే సంస్థ చెపుతోంది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తమ ఖాతా కూడా తెరువలేవని తెలుస్తోంది. ఏపీ ప్రజలు గత ఐదేళ్ల కాలంలో తమకు జరిగిన అన్యాయాన్ని ఓట్ల ద్వారా ప్రతిబింబచేస్తున్నారని సర్వేను చూస్తే అర్థమవుతుంది.
జగన్ పాలనలో రాజధానిపై స్పష్టత లేకపోవడం, పోలవరం మూలకుపడడం, ప్రత్యేక హోదా అటకెక్కడం, ఉపాధి, ఉద్యోగాలు హుష్ కాకి కావడం..ఇలా ఎన్నో అంశాలు ప్రజలను ఆలోచింపచేసినట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన కూటమికే పట్టం కట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు భావించవచ్చు.