Landmarks of Mahabharata In Nalgonda : మనకు రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. రామాయణంలో మనిషి నైతిక ప్రవర్తన ఎలా ఉండాలని, మహాభారతంలో ఆడదాని ఉసురుపోసుకుంటే కలిగే అనర్థాలేమిటో తెలియజేస్తాయి. ఇలా ఈ ఇతిహాసాలు మన జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఆ పురాణ గాథలే మనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. అనాదిగా మన జీవితాలపై చెరగని ముద్ర వేస్తున్నాయి.
మహాభారతంలో పద్మవ్యూహం యుద్ధంలో ఒక భాగం. అర్జునుడి కుమారుడు అభిమణ్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని మరణిస్తాడు. అతడికి బయటకు వెళ్లే మార్గం తెలియక శత్రువుల చేతిలో అమరుడవుతాడు. దీని చిత్రం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో బయట పడింది. దీంతో ప్రాచీన మానవుడి అడుగుజాడలు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. రాతికొండపై చెక్కిన పద్మవ్యూహం చిత్రం కనిపించడం నిజంగా విశేషమే.
కాకతీయుల కళా సంపదకు పుట్టినిల్లు నల్లగొండ. కాకతీయ, చోళుల శిల్ప కళా సంపదకు అనేక ఆధారాలు ఇక్కడ లభించాయి. బౌద్ధమతానికి చెందిన గుర్తులు కూడా కనిపించాయి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఆదిమానవుడి ఆనవాళ్లు కనిపించాయి. మాచన్ పల్లి రాముని గుట్టపై శివాలయం ఉంది. అక్కడ మనకు చాలా రకాల చిత్రాలు కనిపించడం గమనార్హం.
శివాలయంలోని కొలను ఒడ్డున పద్మవ్యూహాన్ని పోలిన చిత్రం ఉండటంతో దీనిపై చారిత్రక అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. మహాభారత యుద్ధంలోని పద్మవ్యూహాన్ని చిత్రంగా వేయడంతో చరిత్రకారులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. సుమారు 8 వేల సంవత్సరాల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. దీంతో మహాభారత కాలంలోని పద్మవ్యూహం చిత్రం వేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.