Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ చట్టం భయంకరమైనది: సీఎం చంద్రబాబు

Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ చట్టం భయంకరమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు.

అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ఏపీ శాసన సభ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

TAGS