Land Titling Act : వైఎస్ జగన్ కొత్తగా భూమి యాజమాన్యపు యాక్ట్ ( ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ను 2022లో తీసుకొచ్చారు. దీన్ని మోడీ సమక్షంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇది అమలు అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది..
దీని ఉద్దేశం ఏంటంటే… ‘ఆంధ్రప్రదేశ్ లో అమలులోకి తెచ్చిన భూమి యాజమాన్యపు యాక్ట్’ ప్రజలకు యమపాశంగా మారబోతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లు భూములకు సంబంధించిన సేవలు అందించిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయి.
ఈ వైసీపీ తెచ్చిన భూమి యాజమాన్య చట్టం ప్రకారం ‘భూ ఆధారిత సంస్థ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో) ను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారి ప్రజలకు సంబంధించిన స్థిర ఆస్తులు అన్నీ ఆ టీఆర్వో పరిధిలోకి వెళ్లిపోతాయి.
ఇది అమలైతే మీ వారసులకు, అమ్మాయిలకు భూమి బదలాయింపు చేయాలంటే ఆ టీఆర్వో నుంచి అనుమతి పొందాలి. మీ అవసరానికి ఆస్తి అమ్ముకోవాలన్నా టీఆర్వో అనుమతి కావాలి. మీరు బాకీ రాబట్టుకోవడానికి తనఖా పెట్టుకుంటే దాన్ని టీఆర్వో వద్ద తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. భూములపై కోర్టులకు వెళ్లాలంటే ఇదే టీఆర్వో ఎన్వోసీ ఇవ్వాలి. మీరు స్థిరాస్థి కొంటే తిరిగి టీఆర్వో దగ్గర నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి టీఆర్వో చేసిందే తుది నిర్ణయం. దాని మీద సాధారణ సివిల్ కోర్టుల్లో సవాల్ చేయడం కుదరకుండా వైఎస్ జగన్ సర్కార్ దారుణమైన చట్టం తెచ్చింది.
మీ ఆస్తిని కానీ.. టీఆర్వో తన వద్దనున్న వివాదాల రిజిస్ట్రర్ లో చేర్చినట్టు అయితే దీన్ని మీరు హైకోర్టులో తప్ప కింద కోర్టులో సవాల్ చేయడానికి వీలు కాదు.
టీఆర్వో నియామకమైన తర్వాత పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లు, వివాదాలను నమోదు చేయించుకోవాలి. భిన్నంగా కోర్టు తీర్పు వచ్చినా టీఆర్వో దగ్గర అనుమతి తీసుకొని నమోదు చేయించుకోవాలి. టీఆర్వో సర్టిఫికెట్ ఇవ్వకుంటే మీరు కోర్టులో వేసే దావా, అప్పీలు చెల్లకుండా పోతుంది. మీ ఆస్తికి సంబంధించి ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే దాన్ని టీఆర్వో దగ్గర నమోదు చేయించుకోవాలి.
ఈ వైసీపీ సర్కార్ తెచ్చిన చట్టం వల్ల మీ భూములకు సంబంధించిన ఏ విషయం అయినా ‘టీఆర్వో’ దయాదాక్షిణ్యాలపై బతకాల్సి ఉంటుంది. వాళ్లు లంచగొండులు అయితే మీ ఆస్తులన్నీ పోయే ప్రమాదం ఉంటుంది. జగన్ సర్కార్ సీక్రెట్ గా తెచ్చిన ఈ బిల్లుపై ఏపీ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ చట్టంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.