Chandrababu Viral Video : ‘‘మీ భూములన్నీ జగన్ పేరు మీద పెట్టుకున్నాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ప్రకారం మీ భూమి మీది కాదు. మీ భూమి జగన్ గుప్పిట్లో ఉన్నాయి. మీ భూమి రికార్డులన్నీ ఓ ప్రైవేట్ కంపెనీలో రికార్డయి ఉన్నాయి. మీ భూమిని మీరు అమ్మాలన్నా అమ్మలేరు. అమ్మాలంటే ఆయన అనుమతి తీసుకోవలసి ఉంటుంది. మీ భూములను లాగేసుకునే ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని అడుగుతున్నా..? అలాంటి ఈ చట్టానికి సంబంధించిన పేపర్లు మనకు అవసరమా..? అని పేపర్లను చించి పారేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ వీడియో ప్రతి ఒక్కరు చూచి ఏపీ ల్యాండ్ యాక్ట్ 2023పై ఆలోచించాల్సిందే. చంద్రబాబు ఆ చట్టం గురించి స్పష్టంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రధానంగా భూములపై సంబంధిత యజమానులు వారి హక్కును ఎలా కోల్పోతున్నారో గమనించాలని, ప్రజల భూములను లాక్కోవడానికి జగన్ వేసిన ప్రణాళికను అందరూ గుర్తించి, ఈ ఎన్నికల్లో మీ నిర్ణయాన్ని వెల్లడించాల్సిన అవసరముందని వీడియోలో చంద్రబాబు సూచిస్తున్నారు.
అయితే ఈ చట్టం వస్తే భూములు పోతాయని తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ యజమానులకు మరింత కచ్చితమైన భరోసా వస్తుందని చెబుతోంది.