Land occupation : స్థలం కబ్జా.. యజమాని హత్యకు వైసీపీ నేత కుట్ర

Land occupation
Land occupation : స్థలం కబ్జా చేసి యజమానిని చంపేందుకు సుపారీ ఇచ్చిన ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది. స్థల యజమాని ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేసేందుకు చిల్లకల్లుకు చెందిన వ్యక్తికి సుమారు రూ.24 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గ్యాంగ్, ఉమామహేశ్వర శాస్త్రిపై దాడికి యత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు సుపారీ గ్యాంగ్ లో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. వైసీపీ నేత గౌతంరెడ్డి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చారని భూ యజమాని ఉమామహేశ్వర శాస్త్రి ఆరోపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గౌతంరెడ్డి కోసం గాలిస్తున్నారు.