Lal Salaam Review : ‘లాల్ సలాం’ మూవీ ఫుల్ రివ్యూ..ఇదేమి సినిమా సామీ!

'Lal Salaam' Movie Full Review..

‘Lal Salaam’ Movie Full Review..

Lal Salaam Review : గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరం కళ్లారా చూసాము. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా వసూళ్లను నేటి తరం సౌత్ సూపర్ స్టార్స్ గా పిలవబడే ప్రభాస్, విజయ్ లాంటి వాళ్ళు కూడా భారీ కాంబినేషన్స్ తో వచ్చినప్పటికీ దాటలేకపొయ్యారు.

ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లను అందుకోవడం మన స్టార్స్ కి పెద్ద సవాలే. అలాంటి సినిమా తర్వాత రజినీకాంత్ నుండి అభిమానులు అంతకు మించిన సినిమాని కోరుకుంటారు. కానీ రజినీకాంత్ మాత్రం అభిమానుల అంచనాలకు అందకుండా ‘లాల్ సలాం’ అనే చిత్రం లో ముఖ్య పాత్ర పోషించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంత వరకు రీచ్ అయ్యిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ విషయానికి వస్తే కసుమూరు అనే గ్రామం లో గురు(విష్ణు విశాల్), షంషుద్దీన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. కానీ వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక విషాదకరమైన సంఘటన కారణంగా వీళ్లిద్దరు విడిపోయి భద్ర శత్రువులుగా మారుతారు. ఇది ఇలా ఉండగా మొయిద్దీన్ భాయ్ (రజినీకాంత్) కి టెక్స్టైల్ వ్యాపారం లో గురు తో, అతని గ్రామం తో వ్యాపార సంబంధాలు ఉంటాయి. అయితే కసుమూరు గ్రామం ని పక్క గ్రామస్తులు అనేక సందర్భాలలో అవమానిస్తూ ఉంటారు. ఈ అవమానాల వాళ్ళ గురు, షంషుద్దీన్ మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంటుంది. అది రెండు ఊర్లకు ప్రమాదకరం అని అర్థం చేసుకున్న మొయిద్దీన్ భాయ్ ఈ రెండు ఊర్ల మధ్య సయోధ్య కుదిరించడానికి చొరవ తీసుకుంటాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ, స్లో న్యారేషన్ కారణంగా ఆడియన్స్ కి చాలా బోర్ కొడుతోంది. స్క్రీన్ ప్లే ని కూడా ఆసక్తికరంగా నడిపించలేకపోయింది డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఇక రజినీకాంత్ పోషించిన ప్రధాన పాత్రనే ఈ సినిమాకి హైలైట్. కానీ ఆయన్ని కూడా సరిగ్గా వాడుకోలేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతుంది. విష్ణు విశాల్ , విక్రాంత్ పెర్ఫార్మన్స్ బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకుడికి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.

TAGS