Minister Komati Reddy : లాల్ దర్వాజ బోనాలు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy
Minister Komati Reddy : హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు లాల్ దర్వాజ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో వారు పాల్గొన్నారు. అంబర్ పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవాి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా వంటి మహమ్మారులు రాకుండా అమ్మవారు ప్రజలందిని కాపాడాలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.