Lakshmi Parvathi : అందుకే జగన్ వెంట నడుస్తున్నాను

Lakshmi Parvathi : ఎన్టీఆర్ భార్యగా తన ఆశయం ఏంటన్నది లక్ష్మీపార్వతి బయటపెట్టారు. నా ఆశయం నెరవేరిందని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ పార్టీలోకి రావడానికి కారణం చెప్పారు. 15 ఏళ్లు సొంత పార్టీని నడిపానని.. నా దగ్గర క్యాడర్, నేతలు ఎవరూ లేకుండా పోయారని.. నా ఆశయం ఎలా నెరవేర్చుకోవాలో తెలియక మథన పడ్డానన్నారు.

వైఎస్ఆర్ మరణం తర్వాత కుట్రకు బలైపోతున్న జగన్ ను చూసి జాలిపడ్డానని.. నాలాగానే జగన్ ను తొక్కేస్తున్నారనే ఆయన వెంట నిలబడ్డానని లక్ష్మీపార్వతి నిజాలు బయటపెట్టారు. మొదటి నుంచి ఒక బిడ్డలాగా చూసుకున్నానని.. తనను తల్లిగా చూస్తాడని చెప్పుకొచ్చారు.

పార్టీ పెద్దలు సుబ్బారెడ్డి, సజ్జల , కరుణాకర్ రెడ్డి ముగ్గురూ వచ్చారని.. మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని.. జగన్ పిలిచారు కాబట్టి తాను వైసీపీలో చేరానని లక్ష్మీపార్వతి వివరించారు.

లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.

 

TAGS