Lakshmi Manchu : లక్ష్మి మంచు ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ : ఫ్యాన్స్‌కు హెచ్చరిక

Lakshmi Manchu
Lakshmi Manchu : తెలుగు నటి లక్ష్మి మంచు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. “నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింది. నా స్టోరీస్‌లో ఉన్న ఏ కంటెంట్‌నూ నమ్మవద్దు.. నాకు డబ్బు అవసరమైతే, సోషల్ మీడియాలో కాకుండా నేరుగా అడుగుతాను..” హస్యాస్పదంగా స్పందించారు.
హ్యాకర్లు ఆమె ఖాతాలో ట్రేడింగ్ స్కీమ్‌లకు సంబంధించిన ఫేక్ స్టోరీస్ పోస్ట్ చేసి, ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. లక్ష్మి మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ సమస్యలు, ఫేస్ రికగ్నిషన్ వైఫల్యం వంటి సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అంతేకాక, హ్యాకర్లు ఆమె ఫోన్ నంబర్‌ను కూడా యాక్సెస్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన ఆమెకు భయాందోళన కలిగించినప్పటికీ, ఆమె తన సహజమైన హాస్యంతో అభిమానులను అప్రమత్తం చేయడం విశేషం.