Lakkireddy Bal Reddy Death Anniversary : ఎంతో మంది ప్రవాస భారతీయులను ఆశ్రయం, ఉపాధి కల్పించిన వ్యక్తి లకిరెడ్డి బాలి రెడ్డి అని వక్తలు అన్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన ఆయన లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లను నడిపేవారు. 1937వ సంవత్సరంలో జన్మించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ పట్టణంలోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ పట్టా అందుకున్నారు.
1960లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ అభ్యసించేందుకు వెళ్లారు. చదువు పూర్తి చేసుకున్న ఆయన అక్కడ వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. 1975 సంవత్సరం నాటికి ‘రెడ్డి డౌన్‌టౌన్’ పేరుతో బర్కిలీలో ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించడం విశేషం. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లాడు. 2000 సంవత్సరం బర్కిలీలో అతిపెద్ద మరియు సంపన్నుడిగా ఎదిగాడు.
లకిరెడ్డి బాల్ రెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యుల మధ్య బర్కిలీలో నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరంలో సోమవారం (నవంబర్ 13) రోజు నిర్వహించారు. లకిరెడ్డి బాలిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రకాశ్‌రెడ్డి, డా. హనిమి రెడ్డి, హాజరై నివాళులర్పించారు. TANA మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం బాలిరెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.