Lagacharla : లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో మరో 8 మంది

Lagacharla
Lagacharla : లగచర్లలో అధికారులపై దాడి కేసులో పోలీసులు తాజాగా మరో 8 మందిని అదిపులోకి తీసుకున్నారు. వీరిని పరిగి పోలీసు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. మిగతా 16 మందిని పరిగి నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు.
మరోవైపు లగచర్ల ఘటనపై వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీ మహేశ్ భగవత్ వివరాలు సేకరిస్తున్నారు. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.