Lagacharla : లగచర్ల దాడి కేసు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక నిందితుడు

Lagacharla : లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో సురేష్ ఏ2గా ఉన్నాడు. దాడి జరిగిన రోజు నుంచి నిందితుడు సురేష్ పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ, అనూహ్యంగా సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ప్రజాభిప్రాయ సేకరణ రోజు కలెక్టర్ బృందాన్ని వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేష్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో సురేష్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించడంతో ఆయనే పక్కా పథకంతో అధికారులను అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

TAGS