JAISW News Telugu

Lady Aghori : లేడీ అఘోరి ఘోరాలు: యోని పూజ పేరుతో రూ.10 లక్షలు

Lady Aghori : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న లేడీ అఘోరి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళా నిర్మాత, లేడీ అఘోరి శివ విష్ణు బ్రహ్మ అట్లూరిపై యోని పూజ పేరుతో రూ.10 లక్షలు మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా పరిచయం కొనసాగుతోందని తెలిపిన బాధితురాలు, ప్రగతి రిసార్ట్స్‌ దగ్గర మొదలైన సంబంధం చివరకు యోని పూజ పేరుతో రూ.5 లక్షలు రెండు సార్లు చెల్లించేందుకు దారి తీసిందని చెప్పింది. పూజ విఫలమవుతుందని బెదిరించడంతో మొత్తం రూ.10 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఈ ఘటనతో లేడీ అఘోరి మోసాలపై మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Exit mobile version