Rajinikanth : రజినీకాంత్ ‘లాల్ సలాం’ చిత్రానికి బయ్యర్లు కరువు..కారణం అదేనా?

Lack of buyers for Rajinikanth's 'Lal Salaam'

Lack of buyers for Rajinikanth’s ‘Lal Salaam’

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత రజినీకాంత్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టి సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ ని కచ్చితంగా దాటేస్తాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ సవాళ్లు విసిరారు.

వాళ్లిద్దరూ హీరోలుగా నటించిన భారీ కాంబినేషన్ చిత్రాలు ‘లియో’, ‘సలార్’ రెండు సినిమాలు కూడా ‘జైలర్’ వసూళ్లను అందుకోవడం లో విఫలం అయ్యాయి.  దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ‘జైలర్’ సినిమా వసూళ్లను అందుకోవడం ఎంత కష్టమైనదో అని. ఈ సినిమా రికార్డ్స్ ని ఎట్టిపరిస్థితి లో మళ్ళీ రజినికాంత్ మాత్రమే బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వల్ల కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘లాల్ సలాం’ అనే చిత్రం ఈ నెల 9 వ తారీఖున విడుదల కాబోతుంది.

అయితే ఈ సినిమాకి మార్కెట్ లో ఏమాత్రం డిమాండ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన రజినికాంత్ సినిమాకి ఇంత తక్కువ క్రేజ్ ఉన్నట్టు చూడడం ఇదే తొలిసారి. అందుకు కారణం కూడా లేకపోలేదు, అదేమిటి అంటే ఈ చిత్రం లో రజినీకాంత్ హీరో పాత్రని చెయ్యలేదు, కేవలం ముఖ్య పాత్ర మాత్రమే పోషించాడు అంటే. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఇలా ఆయన ప్రధాన పాత్ర చెయ్యడం వల్ల ఇది రజినీకాంత్ సినిమా అని ఆయన అభిమానులు సైతం ఫీల్ అవ్వలేదు.

అందుకే ఈ చిత్రానికి మార్కెట్ లో బజ్ ఏర్పడలేదు. ఫిబ్రవరి 9 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే ఈ సినిమాకి టాక్ వస్తే కానీ ఆడియన్స్ థియేటర్స్ వైపు కన్నెత్తి చూసేలా కూడా లేరు. కనీసం పాటలు అయినా క్లిక్ అయ్యుంటే ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడేది, కానీ అది కూడా జరగలేదు. రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ కి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. చూడాలి మరి జైలర్ కి పని చేసినట్టుగా రజిని మ్యాజిక్ ఈ చిత్రానికి కూడా పనిచేస్తుందా లేదా అనేది.

TAGS