Goshamahal : హైదరాబాద్ లోని గోషామహల్ లో నాలా రోడ్డు భారీగా కుంగింది. దారుస్సలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫైవుడ్ దుకాణాల ముందు శివరేజ్ పెద్ద నాలా కుంగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఇదే నాలా కుంగింది.