Kumari Aunty : సోషల్ మీడియాలో వల్ల తీవ్రంగా నష్టపోయానంటున్న కుమారీ ఆంటీ

Kumari Aunty

Kumari Aunty

Kumari Aunty :  కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ సోష‌ల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమ‌స్ అయిపోయింది. ‘నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం మీది 1000 అయ్యింది’ అంటూ తన ఫుడ్‌తో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ. అయితే తనకి వచ్చిన పాపులారిటీతో ఇప్పుడు కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. సెలబ్రిటీ అంటే.. అదేదో యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదు.. అంతకు మించి. యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయి దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ.. వరుసగా టీవీ షోలు చేస్తోంది. ఆ మధ్య ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపించింది.

ఆ తరువాత స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయిన ‘బీబీ ఉత్సవం’ స్పెషల్ ఈవెంట్‌కి కూడా వెళ్లింది. వెళ్తూ వెళ్తూ.. తన చేతి వంట రుచిని చూపించింది కూడా. అలాగే జీ తెలుగులో ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్‌లో గెస్ట్ రోల్ లో కనిపించింది. మొత్తానికి ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు.. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నింటినీ చుట్టేసి.. ఫుల్ బిజీగా మారిన కుమారి ఆంటీ.. ఇక దుకాణం సర్దేసి ఫుల్ టైప్ నటిగా మారబోతుందా అంటే.. అబ్బే అదేం లేదు.. నా ఉపాధి ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవుతానంటోంది.. ఖాళీ టైంలో మాత్రమే షోలు చేస్తుంటానంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం కుమారీ ఆంటీ.. తన ఫుడ్ బిజినెస్ దగ్గర కనిపించడం లేదట. అతని భర్త, కుమారుడు మాత్రమే అక్కడుంటున్నారు. కారణం ఏంటో తెలీదు కానీ ఇటీవల ఓ సందర్భంలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియా వల్ల నష్టపోయనంటూ బాంబు పేల్చింది. మా అయన వల్లే ఇలా ఉన్నాం. ఫేమస్ అవ్వడం నాకు మైనస్ అయ్యింది?.. ఇందుకు ఎవరిని తప్పు పట్టలేం!. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు.. బిల్డింగ్ కట్టుకోవాలనేదే నా కోరిక.. అలాగే ఆంధ్రాలో ఫ్రీ గ్యాస్… మంచి పథకమంటూ చెప్పుకొచ్చింది.

ఎప్పటికైనా పవన్ సీఎం కావలని కోరుకుంటోంది. ఆయన అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని అంటోంది. కంప్లైంట్ ఇవ్వడం వల్లే షాప్ తీసేశామని ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ని చూస్తే శ్రీ రాముడిని చూసినట్టు ఉందని తెలిపింది. సోనూ సూద్ చేసిన సాయం మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అందరికి అన్నం పెట్టడం ఓ వరం. నా బలమే… నా ఫ్యామిలీ… అవకాశం వస్తే బిగ్ బాస్ కు వెళ్లానని చెప్పింది కుమారి ఆంటీ.. అదే సమయంలో ఈ సారి విన్నర్ గా నిఖిల్ నిలుస్తాడని ఆమె చెప్పుకొచ్చింది.

TAGS