Kumari Aunty : ఒకప్పటి లాగ కాదు..ఒకప్పుడు సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ, ఎంటర్టైన్మెంట్ షోస్ లో కానీ ఒక్క అవకాశం దక్కాలంటే స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అలా తిరిగితే కానీ అవకాశం వస్తుందా అంటే అనుమానమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వృద్ధి లోకి వచ్చిన తర్వాత సినిమా/సీరియల్స్ లో అవకాశాలు చాలా సులువు అయ్యాయి. తమ టాలెంట్ ని చూపించుకునేందుకు ఇంస్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ వంటి యాప్స్ వచ్చాయి.
వీటి ద్వారా ఎవరైనా పాపులర్ అయిపోవచ్చు. రీసెంట్ గా సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్న పేరు కుమారి ఆంటీ, మాదాపూర్ ఐటీఐ రోడ్డు వద్ద ఈమె ఏర్పాటు చేసిన ఫుడ్ సెంటర్ లోని ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయని ఒకరు సోషల్ మీడియా లో వీడియో తీసి అప్లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె ఫుడ్ సెంటర్ అడ్రస్ ని కనుక్కొని మరీ వెళ్లి ఎగబడి తింటున్నారు.
విచిత్రం ఏమిటంటే ఈమె ఫుడ్ సెంటర్ కి కేవలం హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈమె కారణంగా రద్దీ పెరుగుతుండడం వల్ల, ఆమె ఫుడ్ సెంటర్ ని మూయించారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి కి రీచ్ అవ్వడం తో ఆయన వెంటనే ఫుడ్ సెంటర్ ని రీ ఓపెన్ చేయించాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ చేతి వంట నైపుణ్యం గురించి సీఎం స్థాయి వ్యక్తి స్పందించడం మామూలు విషయం కాదు. ఇలా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ గా మారిపోయిన కుమారి ఆంటీ ని రీసెంట్ గా బిగ్ బాస్ యాజమాన్యం కాంటాక్ట్ అయ్యిందట.
త్వరలో ప్రారంభం అవ్వబొయ్యే సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనాల్సిందిగా ఆమెకి ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఆమె రోజుకి సంపాదిస్తున్న దాని కంటే 20 శాతం ఎక్కువ రెమ్యూనరేషన్ ని ఇవ్వడానికి సిద్ధం అయ్యిందట. బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని, టైటిల్ గెలిస్తే ఒక పెద్ద హోటల్ పెట్టుకోవచ్చు, నా హోటల్ పేరు కూడా మారుమోగిపోతుంది అనే ఉద్దేశ్యం తో ఆమె కూడా బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె ఫుడ్ సెంటర్ ని కుటుంబ సభ్యులు రన్ చేస్తారట.