ఫోన్ ట్యాపింగ్, నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. లీగల్ నోటీసులు కూడా పంపారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగ చైతన్య, సమంతల ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, సమంత తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని అమల రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొండా సురేఖ మాటలపై కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసు పంపారు. తన పేరును కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఒక మహిళగా ఉంటూ మరో మహిళ పేరును, సినిమా పేరును వాడుకుని వ్యక్తిగతంగా దూషించడం విచారకరం. తనకు సంబంధం లేని విషయాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని లీగల్ నోటీసులో పేర్కొంది.
KTR : కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన కేటీఆర్
KTR Respond on Konda Surekha Comments : తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్ రెడ్డి పైనా వేస్తా’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.