JAISW News Telugu

KTR : పరువునష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలం

Facebook
X
Linkedin
Whatsapp
KTR

KTR

KTR : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్కసుమన్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్ తో పాటు దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు.. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30న నమోదు చేయనుంది.
Exit mobile version