KTR:గవర్నవర్ ప్రపంగం విని సిగ్గుపడుతున్నా:కేటీఆర్
KTR:అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, తప్పులే అని అసెంబ్లీ సాక్షిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు..ఆకలి కేకలు ఉండేవి` అని కేటీఆర్ మండిపడ్డారు.
పదేళ్ల పాలనపై మాట్లాడమంటే మళ్లీ గతం గురించి ప్రస్తావించడం ఏంటని మంత్రి పొన్నం ప్రభాకర్ ..కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కొంత మంది ఎన్నైరైలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదే పదే గత పాలన గురించి మాట్లాడుతున్నారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
ఎంపీగా గెలిపించింది, కేంద్రమంత్రిని చేసిందే కాంగ్రెస్. హరీష్ రావు, తలసాని, గంగుల కమలాకర్, పోచారం, దానం నాగేందర్, కడియం శ్రీహరి గతంలో మంత్రులుగా చేయలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.