KTR – Kavitha : ఢిల్లీలోని తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆమెను కలిసి మాట్లాడిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
అయితే ఢిల్లీ మద్యం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమ్దు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం కేసులో కవిత పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జూలై 6న చేపడతామి కోర్టు స్పష్టం చేసింది.