KTR Insulted Chandrababu : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చంద్రబాబుపై పలు చలోక్తులు విసిరారు. ఆయన స్థాయిని మరింత దిగజార్చుతూ పలుమార్లు మాట్లాడారు. దీంతో కేటీఆర్ మాటలకు అందరు ఆశ్చర్యపోయారు. అధికార మదంతో కేటీఆర్ మాట్లాడిన మాటలు టీడీపీని అవమానానికి గురిచేశాయి. తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇలాంటి మాటలతో గాయపరచడం కేటీఆర్ స్థాయికి తగదని పలువురు హెచ్చరించారు. ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
అధికార దురహంకారం, ధనమదంతో ఎలా పడితే అలా మాట్లాడిన కేటీఆర్ కు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే వాదనలు వస్తున్నాయి. అవాకులు, చెవాకులు, దుర్భాషలు, హేళనలు చేయడం తగదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని పలుమార్లు విమర్శించారు. చంద్రబాబు అరెస్టును అందరు ఖండిస్తే మాకేం అవసరమని అధికార గర్వంతో మాట్లాడటం అందరికి అసహ్యం కలిగించింది.
మనిషి పుట్టుక పుట్టిన వాడు ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడారంటే అతడికి సంస్కారం లేనట్లే లెక్క. మనిషి అనే వాడు బీఆర్ఎస్ ను నమ్మడం లేదు. బీఆర్ఎస్ నేతలకు ఓట్లు వేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. బుద్ధి ఉన్న వాడెవడు కూడా బీఆర్ఎస్ కు ఓటు వేయరని చెబుతున్నారు. వాగ్దానాలన్ని తుంగలో తొక్కి ఏవో పథకాలు తీసుకొచ్చి బురిడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నా ఎవరు నమ్మడం లేదు.
ఈక్రమంలో బీఆర్ఎస్ కు ఇక చీకటి రోజులు వచ్చినట్లే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడతారని సర్వేలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంటికెళ్లడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి ప్రతి ఒక్కరు కౌంటర్ వేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను దూరం పెట్టేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.