KTR:రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న సీఎం కాదు:కేటీఆర్‌

KTR Hot Comments:మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రారంభోప‌న్యాసం చేస్తూ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. `మార్పు మొద‌లైంది. నిర్భంధం పోయింది` అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌సంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడారు. న‌క్క మోసం చేయ‌న‌ని, పులి మాంసం తిన‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంద‌న్నారు. తాము ఎక్క‌డ ఉన్నా ప్ర‌జ‌ల ప‌క్ష‌మేన‌ని తెలిపారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న సీఎం కాద‌ని, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్య‌మంత్రి అన్నారు.కాంగ్రెస్ పాల‌న‌లో సాగు, తాగు నీరు, క‌రెంట్‌కు కు దిక్కులేద‌ని ఎద్దేవా చేశారు.

న‌ల్ల‌గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఏమైనా ఉందా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పాల‌న‌లో 50 ఎక‌రాల రైతు అయినా స‌రే గుంపు మేస్త్రీలాగ ఉండేవార‌న్నారు. క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడుకు కేసీఆర్. తెలంగాణ త‌ల్లి దాస్య సృంఖాలాలు తెంచిన కొడుకు కేసీఆర్‌ అని తెలిపారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని కాంగ్రెస్ పార్టీ మిడిసిప‌డుతోంద‌ని, ఇంత మిడిసిపాటు ప‌నికిరాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డిపై పంచ్‌లు వేశారు.

`చీమ‌లు పెట్టిన పుట్ట‌లో దూరిన పాము` అని రేవంత్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా భ‌ట్ట‌న్న‌, శ్రీ‌ధ‌రన్న‌, ప్ర‌భాక‌ర‌న్న‌, మా దామోద‌ర‌న్న అదే విధంగా మా ఉత్త‌మ్ అన్న, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్న వీళ్లంతా ఉన్న పార్టీలో ఇవాల దూరి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తీసుకున్న ఆయ‌న చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉటుంది` అంటూ సెటైర్లు వేశారు.

TAGS