KTR : ఇండిపెండెన్స్ రోజున జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ భవన్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడోకడు, వీడొకడు బీఆర్ఎస్ ఇక ఉండదు. విలీనం అవుతదని అంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి నేను లాయర్లతో మాట్లాడితే బీజేపీ తో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు.
మాకు బీజేపీతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా? అని నిలదీశారు. మన పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని కేటీఆర్ అన్నారు. కానీ 24 ఏళ్ల పాటు ఈ పార్టీ విజయవంతంగా కొనసాగింది మరో 50 ఏళ్లు కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకున్నాం అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.
కేటీఆర్ మాట్లాడిన ఫుల్ వీడియోను కింద చూడొచ్చు..