Krishnaraju Wife Syamaladevi : రెబల్ స్టార్ క్రిష్ణంరాజు భార్య శ్యామలాదేవి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన రెండో జయంతిని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన జయంతి వేడుకను అందుకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారని అంటున్నారు.
ఈ నెల 20న క్రిష్ణం రాజు జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ తరఫున 2019లో గెలిచిన రఘురామ క్రిష్ణరాజు తరువాత రెబెల్ గా మారారు. దీంతో రఘురామకు పోటీగా ఉండాలంటే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ గాలిస్తోంది. దీంతో క్రిష్ణంరాజు భార్య అతడికి తగ్గ పోటీ ఇస్తారని భావిస్తున్నారు. అందుకే ఆమె అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతుతున్నట్లు సమాచారం.
రఘురామ వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీటు శ్యామలాదేవికి ఖాయమనే వార్తలు వస్తున్నాయి. రఘురామను ఓడించాలంటే సమర్థులైన వారు కావాలనే వైసీపీ ఆలోచిస్తోంది. దీంతోనే క్రిష్ణం రాజు భార్య పోటీకి సై అంటున్నారు. ఆమె కూడా పోటీకి సిద్ధంగా ఉండటంతో ఇక ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమైపోయింది.
నర్సాపురం నుంచి 1999లో క్రిష్ణం రాజు కూడా 1.65 లక్షల మెజార్టీతో బీజేపీ టికెట్ మీద గెలిచారు. వాజ్ పేయి క్యాబినెట్ లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో కూడా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు శ్యామలాదేవి ఆయన వారసులుగా రాజకీయాల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలవాలని ఆశిస్తున్నారు.
Read more : తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక..మహా నాయకుడు ఎన్టీఆర్