Kothapalli : కొత్తపల్లి సంగమేశ్వరుడి గర్భాలయంలోకి వరదనీరు
Kothapalli flood water : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీశైలం జలాశయం వెనుక జలాల ప్రాంతంలో ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం లోకి వరదనీరు చేరింది. ఆలయం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి గర్భాలయంలో నాలుగు అడుగుల మేర కృష్ణా జలాలు చేరాయి. దీంతో సంగమేశ్వరుడి వేపదారు శివలింగం జలాధివాసంలోకి చేరింది.
అంతకుముందు ఆలయ పురోహితుడు రఘురామశర్మ సంగమేశ్వరుడికి జలాధివాస పూజలు చేశారు. సాయంత్రానికి శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 842.40 అడుగులకు చేరడంతో గర్భాలయంలో నాలుగు అడుగుల మేర నీరు చేరింది. బుధవారం ఉదయానికి ఆలయంలోకి ఏడడుగుల మేర నీరు చేరే అవకాశముంది. జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు చేరితే ఆలయం పూర్తిగా జలాధివాసంలోకి వెళ్తుంది.