Niharika Konidela : నిహారికా వెడ్డింగ్..! పిక్స్ వైరల్..

Niharika Konidela

Niharika Konidela

Niharika Konidela : నాగబాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. కెరీర్ మొదట్లో సినిమాల్లో చేసిన ఈమె తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. తర్వాత బుల్లితెర పైకి వచ్చిన కొన్ని షోలలో కూడా అంటే ‘ఢీ’ లాంటి డాన్స్ షోలో కూడా మెంటర్ గా కనిపించింది. హోస్ట్ గా కూడా చేసి చేసిన నిహారికా నాగ చైతన్య లాంటి స్టార్ హీరోలను సైతం ఇంటర్వ్యూ చేసింది. కెమెరా ముందు ఎలంటి జంకు బొంకు లేకుండా నటించేందుకు ఇలాంటి షోలలో నటిస్తుంటానని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకచ్చింది.

ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘ఒక మనసు’ లవ్ ఎమోషన్ ఫిలిం. ఎంతో ఆకట్టుకుంది. నిహారిక నటన చూసిన వారు డెబ్యూ హీరోయిన్ గా కాకుండా సీనియర్ హీరోయిన్ గా నటించిందని పొగడ్తలతో ముంచెత్తారు. ఒక మనసు తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. దాదాపు కొవిడ్ కు అటు ఇటుగా నిహారికకు పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఫ్యాన్స కు టచ్ లోనే ఉంటూ వస్తోంది. ఇన్ స్టాలో తన పిక్స్ పెట్టుకుంటూ ఫాలోవర్స్ ను కాపాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఊహించని పరిణామాల్లో ఒకటిగా ఆమె డైవర్స్ తీసుకుంది. ఆ సమయంలో చాలా రూమర్స్ ఎదుర్కొంది.

ఇప్పుడు సనిమాల్లో బిజీ కావాలని అనుకుంటుంది. ఒక్క నటనతోనే కాకుండా ప్రొడక్షన్ హౌజ్ కూడా ఏర్పాటు చేసి సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మించాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు చాలా కథలు విన్న నిహారిక త్వరలో మంచి వెబ్ సిరీస్ తో వస్తానని చెప్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. నిహారిక లేటెస్ట్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆమె పెళ్లి కూతురిలా కనిపించి విందు చేసింది.  ఇందులో ఆమె పెళ్లి కూతురిలా రెడీ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అవుతుంది అని చెప్పాలి

TAGS