Konakalla Narayana : ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణ

Konakalla Narayana
Konakalla Narayana : ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా కొనకళ్ల నారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ పలువురు టీడీపీ నేతలు కొనకళ్లను సత్కరించి అభినందనలు తెలిపారు. కొనకళ్ల నారాయణ గతంలో రెండు సార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించడంతో నారాయణకు టికెట్ దక్కలేదు. దీంతో అధిష్ఠానం ఆయనను ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించింది.