CM Revanth Reddy : నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికే.. సీఎం అర్హత – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy
CM Revanth Reddy : భువనగిరి పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సిఎం అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. తెలంగాణను నేనే తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్ ఆనాడు దొంగ దీక్షలు చేశారని పేర్కొన్నారు.
తనతో పాటు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. లెఫ్ట్ పార్టీల మద్దతు తమకు ఉందని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.