Nagarjuna : కోలీవుడ్ ఓకే.. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి నాగ్ ?
Nagarjuna : అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో గ్రీకువీరుడిగా, హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మాస్, కామెడీ సినిమాలే కాకుండా భక్తి రస చిత్రాల్లోనూ నటించి ఆశ్చర్యపరిచాడు. రొమాంటిక్ చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే నాగార్జున నిర్మాతగా కూడా మారి ఎంతో మందిని టాలీవుడ్ కు పరిచయం చేశాడు. హీరోయిన్లు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లకు అవకాశం ఇచ్చాడు.
మొన్నటి వరకు హీరోగా సత్తా చాటుకున్న నాగార్జునను కొంత కాలంగా ప్లాఫులు పలకరిస్తుండడంతో సతమతమవతున్నాడు. అలాగే తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ లను హీరోలుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. కొంత వరకు చైతూ పర్వాలేదనిపించినా, అఖిల్ మాత్రం ఇప్పటికీ ఒక్క సక్సెస్ కూడా కొట్టలేకపోతున్నాడు. ఇక తన సమకాలీన హీరోలతో పోటీ పరంగా కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన నా సామిరంగ సినిమా నాగార్జునకు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. బంగార్రాజు హిట్ తర్వాత నా సామిరంగ కాస్త పర్వాలేదనిపించింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సోలోగా మరో సినిమా చేయడం లేదు. ధనుష్ తో కలిసి కుబేర సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగార్జున హీరోనా, సపోర్టింగ్ రోలా అనేది తెలియడం లేదు. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో క్రెడిట్ అంతా కార్తీనే కొట్టేశాడు.
ఇక రజినీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. తమిళ టాప్ హీరో సూర్యను విక్రమ్ లో పవర్ ఫుల్ రోల్ చూపించిన విషయం తెలిసిందే. అలాంటి క్యారెక్టర్ నాగార్జునకు పడిందని నాగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలోనూ తెలుగులో నాగ్ గెస్ట్ క్యారెక్టర్లలో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేకపోవడంతో ఇలా సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ క్యారెక్టర్లు చేసేందుకు సిద్ధమయ్యాడా అని నెట్టింట కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో పూర్తిస్థాయిలో హీరోగా చేసే సినిమాను నాగ్ ప్రకటించి, ఈ పుకార్లకు చెక్ పెడతాడో లేదో చూడాల్సిందే.