Kolkata : కోల్ కతా చేతిలో లక్నో చిత్తు

Kolkata

Kolkata

Kolkata : లక్నో లోని వాజ్ పేయి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం సాయంత్రం  జరిగిన మ్యాచ్ లో లక్నో ఘోర ఓటమి పాలైంది. కోల్ కతా బ్యాటర్లు చెలరేగి విధ్వంసం సృష్టించిన గ్రౌండ్ లోనే రన్స్ చేయలేక చతికిల పడింది.  కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్  సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ మరోసారి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు.

సునీల్ నరైన్ 7 సిక్సులు, ఆరు ఫోర్లతో 39 బంతుల్లోనే  89 పరుగులు చేయగా.. 14 బాల్స్ ఎదుర్కొని పిల్ సాల్ట్ 32 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా బ్యాటర్లు కూడా చెలరేగి ఆడటంతో 20 ఓవర్లలో  236  పరుగులు చేసింది. మరోసారి పవర్ ప్లేలో  కోల్ కతా భారీ స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ హుల్ హక్ నాలుగు ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

లక్నో సూపర్ గెయింట్స్ బ్యాటింగ్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. భారీ స్కోరు ఛేజింగ్ లో మొదటి నుంచి తడబడింది. మార్కస్ స్టోనియిస్ 39 పరుగులతో లక్నో టాప్ స్కోరర్ కాగా..  కేఎల్ రాహుల్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. లక్నో బ్యాటర్లు భారీ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఎక్కడా కూడా 236 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసేలా కనిపించలేదు.

ఈ ఓటమితో లక్నో సూపర్ గెయింట్స్ నెట్ రన్ రేట్ పడిపోవడంతో అయిదో స్థానానికి పడిపోయింది. 98 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో మైనస్ రన్ రేట్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన లక్నో 6 విజయాలతో 12 పాయింట్లతో ఉంది. ఇంకో మూడు మ్యాచులు మిగిలి ఉండగా.. అన్ని గెలిస్తేనే ప్లే ఆప్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకపోతే వేరే జట్ల గెలుపొటముల మీద ఆధారపడాల్సి వస్తుంది. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీసి లక్నో బ్యాటర్ల భరతం పట్టారు.

TAGS