Kolkata Knight Riders : ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం
Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. ఆఖరికి అతిథ్య జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఓపెనర్ బ్యాట్స్ మెన్ ఫిల్ సాల్ట్.. 14 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 48 పరుగులు చేసి పవర్ ప్లే లో విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో రాణించగా.. రమణ్ దీప్ సింగ్ చివర్లో తొమ్మిది బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 24 పరుగులు చేయడంతో కోల్ కతా 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి కొహ్లి మంచి ఆరంభమే ఇచ్చాడు. విల్ జాక్స్, రజిత్ పాటిదర్ లు హాప్ సెంచరీలతో చెలరేగడంతో ఆర్సీబీ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. 23 బంతుల్లోనే రజత్ పాటిదర్ 53 పరుగుల చేశాడు. విల్ జాక్స్, రజత్ పాటిదర్ లు చెరో అయిదు సిక్సులు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
కానీ రజత్, విల్ జాక్స్ ఇద్దరూ ఒక్క పరుగు తేడాలో అవుట్ కావడంతో మ్యాచ్ కోల్ కతా వైపు మళ్లింది. ఇక్కడి నుంచి బంతి బంతికి మలుపులు తిరుగుతూ టెన్షన్ పెట్టింది. చివరి ఓవర్లో ఆర్సీబీకి 21 రన్స్ కావాల్సిన సమయంలో కరణ్ శర్మ మూడు సిక్సులు బాది ఆశలు రేపాడు. కానీ కరణ్ శర్మ అయిదో బంతికి క్యాచ్ అవుటయ్యాడు.
చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో ఆర్సీబీ బ్యాటర్ లుకీ ఫెర్గుసన్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రన్ అవుట్ కావడంతో కోల్ కతా సంబరాల్లో మునిగిపోగా.. ఆర్సీబీ ప్లేయర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోల్ కతా బౌలర్లలో అండ్రీ రస్సెల్ మూడు కీలక వికెట్లు తీయగా సునీల్ నరైన్ రెండు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు.