Kohli Restaurant : విరాట్ కొహ్లి ప్రపంచం మొత్తం మరువని పేరు. బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి వచ్చాడా.. ఇక ఏదో ఒక రికార్డు సంపాదించంది బయటకు వెళ్లడు. అదీ ఆయన స్టయిల్. వరల్డ్ కప్ లో ఆయన పారించిన పరుగుల వరద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండుల్కర్ ను ఆకట్టుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో సచిన్ పేరుపై ఉన్న రికార్డ్ ను ఆయన తిరగరాశారు.
విరాట్ ఇప్పుడు రెస్ట్రారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. కోల్‌కత్తాలోని కిశోర్ కుమార్ బంగ్లా, గౌరీకుంజు, జుహులో 4500 చదరపు అడుగుల అతిపెద్ద రెస్టారెంట్ ‘వన్8 కమ్యూన్ (One8 Cammune)’ ప్రారంభించాడు. అక్టోబర్ 8వ తేదీన ఈ రెస్టారెంట్ ను కొహ్లీ ప్రారంభించాడు. ఇది జుహులో బాగా ఫేమస్ గా నిర్వహించబడుతుంది. నాస్టాల్జిక్ హెరిటేజ్‌లో ఇంటీరియర్‌లతో పాటు పాతకాలపు-వై షాన్డిలియర్ల మెరుపుతో స్వాగతం పలుకుతుంది. ఇందులో రెస్టారెంట్ తో పాటు బార్ కూడా ఉంది.
ఎంటర్ అవగానే మీ దృష్టిని విరాట్ LED లైట్ సిగ్నేచర్ ఆకర్షిస్తుంది. సుమేష్ మీనన్ రూపొందించిన One8 కమ్యూన్ ఢిల్లీ ఏరోసిటీ తర్వాత దేశంలో రెండవ అవుట్‌లెట్. ఇంటీరియర్స్ చూస్తే విక్టోరియన్ యుగాన్ని గుర్తుకు తెస్తుంది. ఫేమస్ చెఫ్ పవన్ బిష్త్ ఆధ్వర్యంలో రుచికరమైన వంటకాలు ఉన్నాయి. విస్తృతమైన మెనూలో విరాట్ తను వివిధ దేశాలలో పర్యటనల సమయంలో ఆస్వాధించిన రుచులను పొదుపరిచారు. వీటితో సంప్రదాయ ఫుడ్ కూడా దొరుకుతుంది. శాఖాహార, మాంసాహార ప్రియులకు వారి ఇష్టానుసారం ఫుడ్ దొరుకుతుంది.