Gambhir : గంభీర్ విషయంలో బీసీసీఐకి కోహ్లీ భరోసా

Gambhir : గౌతమ్‌ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా ప్రకటించిన తర్వాత చాలామంది క్రికెట్ అభిమానుల మదిలో మెదిలిన తొలి ప్రశ్న ఎంటంటే.. టీమ్‌ఇండియా తరఫున విరాట్ కోహ్లీ కొనసాగుతాడా? లేదా?.

ఐపీఎల్‌ సమయంలో వీరిద్దరి సమయంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే, అవన్నీ గతమని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం గమనార్హం. శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు.. రోహిత్, విరాట్ రెస్ట్ తీసుకోవాలని భావించారు. కానీ, గంభీర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. కోచ్ గా తన తొలి పర్యటన నేపథ్యంలో సీనియర్లు లేకుండా వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిసింది. ఇక విరాట్ కోహ్లీ కూడా గంభీర్‌ అడగ్గానే  కాదనకుండా వెంటనే ఓకే అన్నాడు. దీంతో వారిద్దరిని వన్డే జట్టులోకి టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంది. ఈనేపథ్యంలో బీసీసీఐ ఎదుట విరాట్ వెల్లడించిన విషయాలు  బయటకు వచ్చాయి.

‘‘గౌతమ్ తో గతంలో చోటుచేసుకొన్న ఘటనలేవీ తమ రిలేసన్ పై ప్రభావం చూపించవని, జట్టు కోసం కలిసి ఆడతామని,  ఇద్దరి లక్ష్యం టీమ్‌ఇండియాను గెలిపించడమేనని.. ఈ విషయంలో బోర్డు ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని బీసీసీఐకి విరాట్ భరోసా ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి.  ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన సమయంలో ఎమోషన్ కు  గురికావడం సహజమే. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ మెంటార్‌గా ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్‌ కాస్త దూకుడు ప్రదర్శించాడు.

అయితే, ఈసారి ఐపీఎల్‌లో కేకేఆర్‌కు మారిన తర్వాత మాత్రం కోహ్లీతో కలిసి సంభాషించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీరిద్దరూ ఢిల్లీకే చెందిన వారే కావడం గమనార్హం. తమ ఇద్దరి అనుబంధంపై ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో గౌతమ్ గంభీర్‌ కీలక విషయాలను వెల్లడించాడు.  ‘‘వాస్తవాలకు , అంచనాలకు వ్యత్యాసం ఉంటుంది. కోహ్లీతో నా అనుబంధం దేశం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తన భావాలను వ్యక్తంచేసే హక్కు అతనికి ఉంటుంది. జట్టు విజయం సాధించాలని మనం కోరుకోవడం తప్పేం కాదు. మా బంధం ప్రజలకు మసాలా వంటి వార్తలు ఇవ్వడానికి కాదు’’ అని గంభీర్ వెల్లడించారు.

కొందరు నిరుత్సాహపడ్డారేమో : కోహ్లీ

ఐపీఎల్ 2024 సందర్భంగా  విరాట్ కోహ్లీ నవీనుల్‌ హక్‌, గౌతమ్ గంభీర్‌లను హగ్‌ చేసుకొని ఈ వివాదానికి ముగింపు పలికాడు. ఆ సమయంలో విరాట్ మాట్లాడుతూ.. ‘‘నా  వైఖరితో కొందరు నిరాశపడి ఉంటారు. నవీనుల్‌ హక్‌న, గంభీర్‌ భాయ్‌ను హగ్ చేసుకోవడం కొందరికి నచ్చలేదేమో. గంభీర్‌ నా వద్దకు వచ్చి హగ్‌ ఇచ్చాడు. ఇక మీ మసాలా ముచ్చట్లకు శుభం కార్డు పడింది. మేమేం చిన్న పిల్లలం కాదు’’ అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

TAGS