Kohli-Anushka Dance : ‘కుర్చీమడత పెట్టి’’న కోహ్లీ-అనుష్క.. డాన్స్ కుమ్మేశారు భయ్యా.. వీడియో వైరల్

Kohli-Anushka danced in ‘Kurchi madatha Petti Video viral
Kohli-Anushka Dance : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ‘కుర్చీ మడత పెట్టి.. ’ సాంగ్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పక్కా మాసీ సాంగ్ తో రీల్స్, షార్ట్స్ లక్షల్లో పుట్టుకొస్తున్నాయనే చెప్పాలి. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్ల వద్ద డీజేల్లో యూత్ ఫస్ట్ ఆప్షన్ ఈ పాటే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఈ పాట దేశంతరాలు దాటిపోయిందనే చెప్పాలి. తాజాగా ఈ పాటకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ చేసిన డాన్స్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.
కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని మనకు తెలిసిందే. ప్రపంచంలో అన్ని క్రీడల్లో కలిపి అగ్రశ్రేణి ఆటగాళ్లలో టాప్ -5లో ఉంటారు కోహ్లీ. సోషల్ మీడియాలోని తన అకౌంట్ లలో కోహ్లీ ఒక్క చిన్న ఫొటో పోస్ట్ చేసినా ఆయనకు కోట్లలో ఆదాయం వస్తుందనేది బహిరంగ రహస్యమే. ఇక ఆయన సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోలకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. ఆ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది.
ఇక తాజాగా కుర్చీ మడత పెట్టి సాంగ్ వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉంది. గతంలో కోహ్లీ, అనుష్క తో చేసిన డాన్స్ ను ఎడిట్ చేసి వీరి అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి స్టెప్పులకు కుర్చీ మడత పెట్టి సాంగ్ బాగా సింక్ అయినట్టు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే ఈ పాటకు విరుష్క జోడి డాన్స్ చేస్తే సోషల్ మీడియా బ్లాస్ట్ కావడం పక్కా అని కొందరు అంటున్నారు.
Virat Kohli-Anushka Dance to Kurchi Madathapetti Song from Super Star Mahesh Babu’s Movie.#Fans edit video #ViratKohli𓃵#AnushkaSharma #KurchiMadathapetti #MaheshBabu𓃵 pic.twitter.com/UFaPzxfVGW
— mahe (@mahe950) February 8, 2024