Kodali Nani : త్వరలో కొడాలి నానిని అరెస్టు చేసే అవకాశం?

Kodali Nani

Kodali Nani

Kodali Nani : అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. ఓడపై ఉన్నామని గర్వంలో బండ్లో వెళ్లేవారిపై రాళ్లు విసిరిదే.. ఏదో ఒక రోజు బండిపై వెళ్లే పరిస్థితి మనకు వస్తుంది. ఇదే పరిస్థితిని నేడు వైసీపీ నాయకులు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఇతర వైసీపీ నేతలపై మాజీ వార్డు వలంటీర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు కొందరు వార్డు వలంటీర్లు, వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలు చేయడంతో పోలింగ్ ప్రక్రియను పక్కదారి పట్టించి ఓటర్లను ప్రభావితం చేయాలని తొలుత భావించారు.

అయితే ఈ వ్యూహాన్ని ప్రతిపక్ష నేతలు అడ్డుకోవడంతో ఎన్నికల సంఘం ఈ వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ, పింఛన్లు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్షాలపై ప్రభావం చూపేందుకు ఉద్దేశించిన ఈ ఎత్తుగడ చివరకు వారికే ఎదురుతిరిగింది. రాజీనామాలతో తీవ్రంగా నష్టపోయిన మాజీ వలంటీర్లు ఇప్పుడు కొడాలి నానిపై విరుచుకుపడుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.

కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనుతో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతలపై గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 447, 506తో పాటు సెక్షన్ 34 కింద అభియోగాలు మోపారు. వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు అనుసరిస్తున్న వ్యూహాల వల్ల ఎదురవుతున్న ఉద్రిక్తతలు, పర్యవసానాలను ఈ లీగల్ యాక్షన్ హైలైట్ చేస్తోంది.
ఈ కేసుల నేపథ్యంలో నేడో రేపో కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ నాయకుల నుంచి లీకులు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని అక్రమాలకు, అరాచకాలపై ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ గతంలో చాలా సమావేశాల్లో విరుచుకుపడ్డారు. ఆయనను అరెస్ట్ చేస్తామని అప్పుడే చెప్పాడు. 

TAGS