Gudivada Road Journey : కొడాలి నాని గుడివాడలో రోడ్డు నరకానికి నకళ్లు..!

Gudivadalo Road Journey Experience
Gudivada Road Journey Experience : ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అధ్వానంగా మారాయి. నడవలేని స్థితిలో కూరుకుపోయాయి. ఎటు చూసినా గుంతలే. అడుగడుగునా అవాంతరాలే. ప్రజల బాధలు వర్ణనాతీతం. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం రోడ్లు సమస్తం గుంతల మయం అన్నట్లుగా మారింది. దీంతో రోడ్ల దుస్థితిపై ఎన్నిమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని వీటి గురించి చొరవ చూపడం లేదనే వాదదనలు వస్తున్నాయి.
గుడివాడ-విజయవాడ రోడ్డు దారుణంగా తయారయింది. ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరకమే గుర్తుకు వస్తుంది. కొందరి ప్రాణాలు సైతం పోయాయి. అంతటి అధ్వానంగా మారాయి. సీఎం జగన్ కు రోడ్లు గుర్తుకు రావడం లేదా? మరమ్మతులు చేయాలనే కనీస జ్ణానం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నోళ్లేసుకుని తిరగడం కాదు పనులు కూడా చేయాలి. లేకపోతే ఇబ్బందులే వస్తాయి.
రోడ్లు ఇలా మారడం పాలకుల తప్పు కాదా? వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓట్లు రావని ఈ రోడ్లు చెబుతున్నాయి. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారాయి. ఎటు చూసినా గుంతలే. ఎక్కడ చూసినా కంకర తేలిన రహదారులే దర్శనమిస్తున్నాయి. దీని వల్ల ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా? రోడ్లు మరమ్మతులు చేస్తుందా? అనే కోణంలో అనుమానాలు తలెత్తుతుతున్నాయి.
దోపిడీ, హత్యల మీద శ్రద్ధ రోడ్ల మీద కరువాయే. దీంతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. రోడ్ల స్థితిపై జనసేన గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినా వైసీపీ పట్టించుకోలేదు. అందుకే రోడ్లను బాగు చేసి ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి. రోడ్లను ఎప్పటికి బాగు చేస్తారో కూడా తెలియడం లేదు.