Indian-2 : ఇండియన్-2 లో విషయంలో అన్ని తెలిసీ ఇలా చేశారేంటి ?

Indian-2

Indian-2

Indian-2 : జూలై12న రిలీజైన ‘ఇండియన్-2’ సినిమాకు ముందు నుంచి బజ్ తక్కువగానే ఉంది. మామూలుగా అయితే ‘ఇండియన్’ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ కావడం, శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందంటే హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఈ సినిమా చిత్రీకరణ చాలా ఆలస్యమైంది. మధ్యలో రెండేళ్ల పాటు ఈ సినిమా చిత్రీకరణ అడ్రస్ లేకుండా పోయింది. అసలు సినిమా మళ్లీ మొదలవుతుందా అనే సందేహాలు కూడా వచ్చాయి.

 రిలీజ్ ముందు విడుదల చేసిన ప్రోమోలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. పాటలు కూడా అంతంతమాత్రమే. భారతీయుడు సినిమా పాటలు ప్రతి భాషలో సంచలనమే. ఏఆర్ రహమాన్ తన మ్యూజిక్ తో అంతలా మ్యాజిక్ చేశాడు.  ఆశించిన బజ్ రాకపోవడానికి కారణాలు అనేకం. సినిమా కు హైప్ తక్కువగా ఉన్నపుడు సాధారణ రేట్లతోనే టిక్కెట్లు విక్రయించాల్సింది. కానీ ఎలాగూ అవకాశం ఉంది కదా అని తెలంగాణ ప్రభుత్వతం నుంచి అనుమతి తెచ్చుకొని ఎడా పెడా రేట్లు పెంచేసుకున్నారు. రేట్ల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్న విషయమై గతంలో మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేయడం గమనార్హం. మరి అన్నీ తెలిసిన సురష్ బాబే ఈ రేట్ల పెంపునకు అనుమతులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

బజ్ లేనపుడు ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలో చెప్పడానికి ‘జైలర్’ సినిమా చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలకు తెలుగులో యమ క్రేజ్ ఉండేది. కానీ పదేళ్లుగా ఆయన సరైన సినిమాలు చేయకపోవడంతో క్రేజ్ తో పాటు  మార్కెట్ కూడా దెబ్బతిన్నది. కొన్ని సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. ఇ
గత ఏడాది ‘జైలర్’ విడుదల చేయగా, రేట్ల పెంపుకోసం నిర్మాతలు ప్రయత్నం చేయలేదు. సాధారణ రేట్లతో సినిమాను రిలీజ్ చేశారు. తొలి రోజు ఆక్యుపెన్సీలో మోస్తరుగా కనిపించింది.

కానీ సినిమా పర్లేదని, రజినీ ఫ్యాన్స్‌కు పండుగ లాంటిదేననే టాక్ రావడంతో జనం థియేటర్లకు పరుగులు తీశారు. దీంతో సినిమా మంచి వసూళ్ల తో పాటు విజయం సాధించింది. సినిమాలో ఉన్న కంటెంట్‌ను మించి సినిమా విజయం సొంతం చేసుకుంది. ‘ఇండియన్-2’కు బజ్ తక్కువగా ఉన్న సమయంలో సాధారణ రేట్లతో సినిమా రిలీజ్ చేయాల్సింది. టాక్ బాగుంటే.. జనం థియేటర్లకు తరలివచ్చే వాళ్లు. ఇక ‘కల్కి’ సినిమాకు రేట్లు తగ్గించాక రెండో వారంలో జనం మరింత థియేటర్లకు రావడం మొదలు పెట్టారు. కానీ ఆక్యుపెన్సీలు పెంచుకొని సినిమాకు లాంగ్ రన్ ఉండేలా చూసుకోవాలన్న దాని కన్నా  తొలి వీకెండ్ లో  వీలైనంత రాబట్టలన్నా తాపత్రయం అసలుకే మోసం వస్తుందని ఇటు నిర్మాతలు, అటు బయ్యర్లు గ్రహిచకపోవడం మరీ విచారకరం.

TAGS