Second Saturday : రెండో శనివారం హాలీడే ఎందుకు ఇస్తారో తెలుసా? దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Second Saturday

Second Saturday

Second Saturday : రెండో శనివారం అంటే స్కూల్ పిల్లల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకూ ఎంతో ఇష్టం. సెకండ్ సాటర్ డే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తమ ట్రిప్పులను, తాము చేయాలనుకున్నా పనులను ఈ రోజు కోసం వాయిదా వేసుకుంటారు. అయితే చాలా మంది రెండో శనివారం హాలీడే ఎందుకు ఇస్తారో తెలియదు. ఇక పిల్లలకైతే అసలే తెలియదు. ఒకవేళ పిల్లలు పేరెంట్స్ ను, టీచర్లను అడిగినా వారి దగ్గర సమాధానం ఉండదు. ఏమో ఎందుకిస్తారో మాకు కూడా తెలియదురా అంటూ దాటేస్తూ ఉంటారు. అందరూ అమితాసక్తితో ఎదురు చూసే రెండో శనివారం సెలవు వెనుక పెద్ద ఆసక్తికర కథే ఉంది.

19వ శతాబ్దంలో మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారనే సంగతి తెలిసిందే. ఒక బ్రిటిష్ ఆఫీసర్ వద్ద చాలా నిజాయితీగా పనిచేసే ఒక సహాయకుడు ఉండేవాడు. అతడు సెలవు దినాల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలవడానికి తమ గ్రామానికి వెళ్లేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతడికి బాధ్యతలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఇంటికి వెళ్లడం మానేశాడు. దీంతో కొడుకు మీద ఉన్న ప్రేమతో అతడిని చూడడానికి తల్లిదండ్రులు పట్నం వస్తారు. కొడుకును చూసిన అనంతరం అతడు పనిచేసే బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి తమ పరిస్థితిని తెలియజేస్తారు. తమ కొడుకు తమ ఇంటికి రావడం లేదని విన్నవిస్తారు.

తన దగ్గర పనిచేసే సహాయకుడికి తల్లిదండ్రులను కలువడానికి కూడా సమయం దొరడం లేదని తెలిసి ఆ బ్రిటిష్ ఆఫీసర్ చాలా బాధపడుతాడు. తన వద్ద ఎంతో నిబద్ధతగా, నిజాయితీగా పనిచేస్తున్న సహాయకుడిని అతడిని ఎంతగానో మెచ్చుకుంటాడు. పని పట్ల అతడి అంకిత భావం చూసి..అతడికి అప్పటి నుంచి ప్రతీ నెల రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించాడు. ఇదే ఆ తర్వాత సంప్రదాయంగా మారి బ్రిటిష్ ప్రభుత్వం రెండో శనివారం అధికారికంగా సెలవు దినం ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఇదే సంప్రదాయం కొనసాగిస్తూ వస్తోంది.

TAGS