Telangana Elections 2023 : తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచినా మంచిదే కానీ కాంగ్రెస్ గెలవకూడదనేది బీజేపీ సిద్ధాంతం. ఇందులో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేననే వాదనలు వస్తున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలవకుండా చేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న సంబంధం నేపథ్యంలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో నిజాలు బయటపడినా అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
కేసీఆర్ తమిళనాడు పోయి స్టాలిన్ కలిసింది హైదరాబాద్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత తోట కబ్జా చేసుకోవడానికే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. నయీం ఎన్ కౌంటర్ చేయించి తన కుట్రలు బయటపడకుండా కాపాడుకున్నారు. దిశ హత్య కేసులో నిందితుల బాగోతాలు బయటపడకూడదనే ఉద్దేశంతో వారిని ఎన్ కౌంటర్ చేయించాడనే పుకార్లు వచ్చాయి.
బీఆర్ఎస్ కు ఒకవేళ 40 సీట్లు వస్తే ఎంఐఎం సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అందుకే బీఆర్ఎస్ కు 20 కంటే తక్కువ సీట్లు వస్తేనే అధికారం దూరం అవుతుంది. ఈనేపథ్యంలో ఎన్నికల సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నా చివరికి ఏదో మాయాజాలం చేస్తే రాజకీయాలు మారిపోవడం ఖాయం. దీంతో బీఆర్ఎస్ కు చరమగీతం పాడాలనే వాదన ముమ్మాటికి వస్తోంది.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. దీంతోనే బీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిస్తోంది. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయి. వంట గ్యాస్ రూ. 500లకే ఇస్తామని చెప్పడంతో చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలపై కాంగ్రెస్ చెప్పిన వాటికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.