Kadapa District : ఇక్కడ ఎవరు గెలుస్తారో ముందుగానే తెలిసిపోతోంది?

Kadapa District

Kadapa District

Kadapa District : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభిం చింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీకి బలం గా ఉన్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బకొట్టడం ద్వారా గెలుపు సులభంగా దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో త్వరలో జరగబో తున్న అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు హోరాహో రీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ప్రస్తుతం ఇక్క డినుంచి వైసీపీ తరఫున దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ తన సమీప పత్యర్థి.. బీజేపీ అభ్యర్థి పి. సురేశ్‌పై పై 90,533 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున బద్వేల్ నుంచి పోటీచేసి విజయం సాధించిన డాక్టర్ జి.వెంకట సుబ్బయ్య 2021 మార్చి 28న మరణించారు. దీంతో అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలోకి దించిం ది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యర్థిని నిలబె ట్టలేదు. బీజేపీ తరఫున సురేష్ పోటీచేసి సుధ చేతిలో ఓటమి పాలయ్యారు.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1955 నుంచి 2004 ఎన్నికల వరకు జనరల్ నియోజ కవర్గంగా ఉండేది. 1983లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత టీడీపీ నాలుగుసార్లు విజయం సాధిం చింది. అందులో మూడుసార్లు బిజివేములు వీరారెడ్డి గెలుపొందారు. 2024లో జరగబోతున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి సుధ పోటీచేస్తారా? వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతారా? అనేది తేలాల్సి ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

TAGS