JAISW News Telugu

Virat Kohli : కోహ్లీ కెప్టెన్ గా అండర్ -19 వరల్డ్ కప్ ట్రోఫీ ఎప్పుడొచ్చిందో తెలుసా? శుభమన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’గా నిలిచిందెప్పుడు?

Kohli won the Under-19 World Cup trophy

Kohli won the Under-19 World Cup trophy as captain

Virat Kohli : అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లోకి టీమిండియా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెమీస్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసి గెలిచిన తీరు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ మరిచిపోలేరు. అండర్ -19 వరల్డ్ కప్ టోర్నీలో తొమ్మిదో సారి ఫైనల్ చేరిన టీమిండియా అనేక రికార్డులను కొల్లగొట్టింది. అలాగే ఎన్నో విశేషాలను సొంతం చేసుకుంది. అవెంటో చూద్దాం..

– టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరడం వరుసగా ఇది ఐదోసారి. మొత్తంగా తొమ్మిదో సారి కావడం విశేషం.

-2000 ఏడాదిలో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో ఫస్ట్ టైమ్ టీమిండియా అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఈ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాడు.

– విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008లో టీమిండియా అండర్- 19 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. ఫైనల్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

– ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో 2012లో మూడో సారి టీమిండియా అండర్- 19 వరల్డ్ కప్ విన్నర్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 225 పరుగులు చేయగా.. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా టార్గెట్ ఛేదించింది. ఆరు వికెట్ల తేడా అద్భుత విజయం సాధించింది.

– 2018లో నాలుగోసారి అండర్- 19 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో భారత్ కు పృథ్వీషా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా శుభమన్ గిల్ నిలిచాడు.

– 2022లో ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నది. ఫైనల్ లో ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

Exit mobile version