Bigg Boss Aditya Om : బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 లో అత్యంత సున్నిత మనస్కుడు ఎవరినీ నొప్పింపక తన ఆట తాను ఆడుతూ ముందుకు సాగిన వ్యక్తి సీనియర్ నటుడు హీరో ఆదిత్య ఓం. దాదాపు ఆదిత్య వయసు 45 సంవత్సరాల నుంచి 50 వరకు ఉంటుంది. తెలుగులో 2002 లో రిలీజ్ అయిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి ఆడక ఆయనకు అవకాశాలు రాక ఫెడఅవుట్ అయిపోయారు.
ఆదిత్య బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి వచ్చినప్పుడు ఆయన ఎంతో బాగా ఆట ఆడగలరని అందరూ అనుకున్నారు. కానీ ఆయనపై తోటి కంటెస్టెంట్స్ ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోకుండా వారిని కనీసం ఒక్క మాట అనకుండా ముందుకు సాగిపోయాడు. కానీ అదే ఈరోజు ఆయనని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ హౌస్ లో గొంతెత్తి మాట్లాడడం ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించడం, వారి తప్పులను ప్రజలకు తెలిసేలా యాక్టివ్ గా మాట్లాడాలని ఆయన తెలుసు కోలుకోలేకపోయారు. టాస్కులు ఆడటం వారిని విమర్శించడం చేయాలి.
కానీ ఆదిత్య కేవలం సైలెంట్ గా ఉండడం వల్లనే ఈరోజు ఆయన ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆదిత్య ఓం మొదట్లో టాస్కులు కూడా సరిగా ఆడలేదు. మెత్తగా ఉండేవాడు. నిఖిల్ క్లాన్లోకి వచ్చిన తర్వాత ఆయన గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. టాస్కులు కూడా ఆడాడు. నిఖిల్ క్లాన్ ని గెలిపించాడు. అప్పుడు ఆదిత్య కు టాస్కులు ఆడగల సామర్థ్యం ఉంది అని అందరూ అనుకున్నారు.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఆడియన్స్ ఓట్లు వేయలేదు. ఇప్పుడు అయ్యో ఆదిత్య కు ఓట్లు వేసి గెలిపిస్తే బాగుండేది అని అనుకుంటున్నారు. కానీ హౌస్ నుంచి బయటపడే సమయంలో ఆదిత్య మాత్రం పూర్తి పాజిటివిటీని మూటగట్టుకుని వెళ్తున్నాడు. ఎన్ని రోజులు హౌస్ లో ఉన్నాం అన్నది కాదు ఎంతమంది ప్రజల ఆధారభిమానాలు పొందామన్నది ఈ ఆట లక్ష్యం అని ఆయన నిరూపించాడు. ఆదిత్య ఓం ఐదు వారాలు ఉన్నప్పటికీ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.