Democracy : ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని ఎన్నికల అధికారులు చాటి చెప్పారు. ఒక మహిళ ఓటు కోసం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని మలోగం గ్రామంలో ఒకే ఒక మహిళా ఓటరు ఉన్నారు. ఆమె పేరు సోకెలా తయాంగ్. ఆమె ఓటు వేయడానికి వీలుగా పోలింగ్ బూత్ ను ఈసి ఆ గ్రామంలో ఏర్పాటు చేసింది.
అయితే ఆ ఊరిలో ఎలక్షన్ విధులు నిర్వహించడానికి 10 మంది అధికారులు 39 కి.మీ. కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి సోకెలా తయాంగ్ ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఓటు కోసం ఈసి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.