Find Name in Voter List : ఓటరు జాబితాలో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా?
Find Name in Voter List : మనకు రాజ్యాంగం ఓటు వేసే హక్కు కలిగించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అవి ఏ ఎన్నికలైనా మన హక్కు మనం వాడుకోవచ్చు. మనకు ఇష్టమైన వారికి ఓటు వేసే అధికారం ఉంటుంది. ముందు మన ఓటు ఓటరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఓట్లు గల్లంతయ్యే అవకాశముంటుంది. అందుకే ఓటరు జాబితాలో మన పేరును ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.
మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తో కూడా మన పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఓటరు జాబితాలోకి వెళ్లి చూస్తే మన ఓటు హక్కు ఉందో లేదో అనే విషయం తెలిసిపోతుంది. మనకు అందుబాటులో ఉండే సెర్చ్ ఇంజిన్ లో electoralsearch.eci.gov.in అని టైప్ చేసి నేరుగా ఓటరు పోర్టల్ లోకి వెళ్లొచ్చు. అక్కడ మన ఓటు ఉందో లేదో తెలుస్తుంది.
అక్కడ సర్వీసెస్ సెక్షన్ లో search in electoral roll పై క్లిక్ చేయండి. అందులో సర్చ్ బై డిటేల్స్, సర్స్ బై ఈపీఐసీ, సర్చ్ మొబైల్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు ఇష్టమైన దానిపై క్లిక్ చేయండి. సర్స్ బై డిటేల్స్ ఆప్షన్ ఎంచుకుంటే అందులో పేరు, తండ్రిపేరు, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం మొదలైన వివరాలు కనిపిస్తాయి. అక్కడ మన పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
మన దగ్గర ఓటరు ఐడీ కార్డు ఉంటే ఆ నంబర్ తో మన ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసినట్లయితే సర్చ్ బై మొబైల్ ఆప్షన్ ఎంచుకుంటే మనకు వచ్చే ఓటీపీతో మన ఓటు గుర్తించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ లో లాగిన్ అయితే బార్ కోడ్, క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా తెలుసుకోవచ్చు.