Free Scooty Scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు ఉచితంగా స్కూటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 18 ఏళ్లు నిండిన యువతులకు ఉచిత స్కూటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ఉండాల్సిన అర్హత, కావాల్సిన ఐడీ, డాక్యుమెంట్లు ఏం కావాలో సూచిస్తోంది. ఇంటర్ పాసైన యువతులకు స్కూటీలు ఇచ్చి వారికి ప్రయాణ కష్టాలు తీర్చాలని భావిస్తోంది.
యువతుల సాధికారత పెంచేందుకు కాంగ్రెస్ సంకల్పించింది. స్కూటీపై కళాశాలలకు వెళ్లేందుకు వారికి ఓ అవకాశం కల్పిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఉచిత స్కూటీ కోసం యువతులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి. ఆడవారై ఉండాలి. ప్రస్తుతం చదువుకునే వారై ఉండాలి. ఇంటర్ పాసై ఉండాలని చెబుతున్నారు.
స్కూటీ పొందాలంటే పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కావాలి. ఆధార్ కార్డు ఉండాలి. విద్యార్హత పత్రం కావాలి. నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి. వార్షికాదాయం ప్రూఫ్ చూపించాలి. కుల ధ్రువీకరణ పత్రం కావాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ మెయిల్ ఐడీ ఉండాలి. అప్లికేషన్ ఫీజు రెడీ చేసుకోవాలి. ఇలా వీటితో దరఖాస్తు చేసుకుంటే ఉచిత స్కూటీ పథకంలో పేరునమోదు చేసుకోవచ్చు.
ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో telangana.gov.in లోకి వెళ్లి హోం పేజీలో త్వరలోనే ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంచుకోవాలి. అందులో అప్లై ఆన్ లైన్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్ వంటి వివరాలు నింపాలి.
తరువాత సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేయాలి. పూర్తి చేశాక సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తులను అప్లై చేశాక ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది. అర్హతలు, పత్రాలను పరిశీలించి అన్ని సరిగా ఉన్నాయని తెలిశాక ఎంపిక చేస్తుంది. తరువాత స్కూటీ ఇస్తుంది.