Terrorist Attacks During UPA Regime : దేశంలో ఉగ్రవాదం వల్ల చాలా మంది చనిపోయారు. ఉగ్ర ముప్పుతో దేశంలోని పలు ప్రాంతాలు నష్టపోయాయి. జమ్ము కాశ్మీర్ అయితే చాలా బాధపడింది. యూపీఏ హయాంలో తీవ్రవాదం రెక్కలు విప్పింది. పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో చాలా మంది బాధితులుగా మిగిలారు. ముంబయి దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ముంబయి దాడుల్లో 406 మంది చనిపోయారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది. దీంతో మనదేశ పరువు కాస్త గంగలో కలిసింది. ఢిల్లీ దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌహతి దాడుల్లో 71 మంది అసువులు బాశారు. హైదరాబాద్ దాడుల్లో 63 మంది చనిపోయారు. జైపూర్ దాడుల్లో 32 మంది, వారణాసిలో 29 మంది, అహ్మదాబాద్ లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈదాడులన్ని యూపీఏ పాలనలో జరిగాయి. కానీ ఎన్డీఏ పాలనలో ఒక్క దాడి కూడా జరగలేదు. ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగుతోంది. రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణం కూడా అదే. ఉగ్రదాడుల నివారణలో ఎన్డీఏ సమర్థంగా పనిచేసింది. ఉగ్రవాదం పీచమనడంలో ముందు నిలిచింది.
దీంతో పాకిస్తాన్ తోక ముడిచింది. డ్రాగన్ చేష్టలకు చెక్ పెట్టడంలో కూడా ఎన్డీఏ విజయం సాధించింది. ఇలా దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మన దేశానికి రక్షణగా నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన దేశానికి ఉగ్రవాద ముప్పు తగ్గించడంలో విక్టరీ సాధించింది. దీంతో తీవ్రవాదులను తుద ముట్టించడంలో క్లారిటీ సాధించింది.
ఎన్డీఏ పాలనలో పదేళ్లు ఉగ్రవాద దాడుల ఊసే లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. 371 ఆర్టికల్ రద్దుతో జమ్ముకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగాన్ని రద్దు చేసింది. ఇది సాహసోపేత నిర్ణయమే అని చెప్పాలి. ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తీవ్రవాదాన్ని అంతం చేసింది. అందుకే మూడోసారి కూడా బీజేపీనే కేంద్రంలో ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో వస్తోంది.